క్షమాపణ

ఆనందంతో జన్మనిచ్చావు
అక్కరకు వస్తానని ఆశించావు
అందనంత ఎత్తుకు ఎదగాలని
ఎదపైనుంచి పాడావు జోల పాట
గోరు ముద్దులతో
పరిచయం చేశావుఈ ప్రపంచాన్ని
అడ్డంకులు దాటుకుంటూ పరిగెడుతుంటే
పసి దానిలాపరవశించావు 
గమ్యం చేరేఊసులో నిన్నునేను గమనించలేదమ్మ వచ్చేలోపే మాయమయ్యావు
ఎవరికి చెప్పాలి
ఈ  నాక్షమాపణలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వర్షం సాక్షిగా