ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం పై ఒక ఆలోచన

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే, ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఇంగ్లీష్ చాలా అవసరం, అన్ని తరగతుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని మంచి ఉద్యోగం చేయంచాలని కోరుకుంటున్నరు.ఆర్థిక స్థోమత లేకప్రైవేటు పాఠశాలలకు పంపడంలేదు ప్రభుత్వప్రాథమిక పాఠశాల విద్యార్థులు 25%మంది, ప్రభుత్వఉన్నత పాఠశాలలో 35%మందివిద్యార్థులు ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలొచదువుచున్నారు.పట్టణ ప్రాంతాలలో సమాంతరంగా నడుస్తున్నటువంటి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు తెలుగుమిడియం విద్యార్థుల కంటే ఎక్కువ మంది ఉంటున్నారు.

                               మాతృభాషలో విద్యాబోధన జరగటం వల్ల విద్యార్థి తొందరగా అవగాహన చేసుకుంటాడు,భావ వ్యక్తీకరణ సులభంగా జరుగుతుంది,తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ అనుకుంటే పొరపాటు అది ఒక సంస్కృతిని ఒక తరాన్ని నుండి ఇంకో తరానికి తీసుకువెళ్లే వారధి.ప్రభుత్వ అనుమతితో నడిచే ప్రైవేటు పాఠశాలలన్నీ ఇంగ్లీష్ మీడియం లోనే నడుస్తున్నాయి మరి అక్కడ పిల్లలకి తెలుగు మాధ్యమం అవసరం లేదా ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనే రెండు మీడియంలలోనే బోధించవలెనా!అక్కడ చదివే విద్యార్థులకు తెలుగు అవసరం లేదా !ఏ ఒక్కరూ ఆ విషయాల గురించి ఎందుకు మాట్లాడరు తెలుగును కాపాడాలి,మన సంస్కృతిని కాపాడాలి అన్న వాళ్లు ఆంధ్ర ప్రదేశ్ లోనిపిల్లలందరికీ కూడా తెలుగు తో పరిచయం అక్కర్లేదా! అదేమంటే ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛ ఉండాలంటారు తప్పులేదు ఆంధ్రప్రదేశ్ లొ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల లందుమొత్తము విద్యార్థులలో 75% ఆంగ్ల మాధ్యమంలోనే 25  శాతం మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో రెండు మాధ్యమాలలో విద్యను అందించడం వల్ల వారికి ఇంగ్లీషు అంతగా రావడం లేదు కారణం వారి తోటి విద్యార్థులతో తెలుగులోమాట్లాడటం ఉపాధ్యాయులు తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియంలలో బోధించడం.
రెండు మాధ్యమాలకు వేరువేరు పాఠశాల ఉండటంవల్ల విద్యార్థులకు న్యాయం జరుగుతుందని నా భావన అదేవిధంగా తెలుగు భాష పైన మమకారం కలిగిన వ్యక్తులు తమ పిల్లలని తెలుగు మాధ్యమంలో  చదివించి తెలుగు భాష అభివృద్ధికి తెలుగు సంస్కృతి అభివృద్ధికి పాఠశాల అభివృద్ధికి ఎందుకు తోడ్పడటం లేదోఅర్థం కావడం లేదు.  ఎంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు పద్యాలు నేర్పుతున్నారు ఎంతమంది  తెలుగు సంస్కృతిని చెబుతున్నారు మమ్మీ డాడీ అంటే మురిసిపోతున్నారు నాలుగు ఇంగ్లీషు పదాలు మాట్లాడితే మా అబ్బాయి బాగా చదువుతున్నాడు అంటున్నారు.  

           రాష్ట్రంలోని ఉద్యోగులు రాజకీయ నాయకులు తెలుగు భాషాభిమానులు వారి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివించి తెలుగునికాపాడండి మన సంస్కృతిని రక్షించండి.ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించేముందు పాఠశాలల్లో మౌలిక వసతులు ఇంగ్లీష్ ల్యాబ్ లుఇంగ్లీషు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులునుఏర్పాటు చేసిన తర్వాత మాధ్యమాన్ని ప్రారంభించిన అప్పుడువిద్యార్థులు ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలనుసాధించి, ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థుల స్థాయికి వెల్ల  గలుగుతారు జాతీయ అంతర్జాతీయ సంస్థలలో మంచి ఉద్యోగాలను సాధించడానికి అన్ని తరగతుల వారికి అవకాశం కుదురుతుంది

                          ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల అన్నిటికి ఒకటే న్యాయం ఉండాలి తెలుగు రాష్ట్రంలో పిల్లలందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించిన తర్వాతే మాధ్యమాన్ని మార్చాలి ఇంగ్లీష్ పై నైపుణ్యం కలిగిన వారిని ప్రత్యేక డీఎస్సీ ద్వారా నియమించాలి తెలుగు భాషను కాపాడదాం మన పిల్లలకు మంచి భవిష్యత్తునిద్దాం.

                          

కామెంట్‌లు

  1. బ్రతుకుతెరువుకోసం భాషలెన్నైనా నేర్చుకో
    బ్రతుకుమొదలైనదే తెలుగు భాషతో..అది గుర్తుంచుకో
    రాష్ట్రాలు తిరుగు
    దేశాలుతిరుగు
    ఎంతగొప్పగానైనా
    ఎంతఎత్తుకైనా ఎదుగు అనంతంగా
    కానీ....
    అమ్మనీ
    అమ్మబాసతెలుగునీ మరువకు అమాంతంగా!

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వర్షం సాక్షిగా